ఘనంగా బిజెపి పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం

Spread the love

కడప జిల్లా ఏప్రిల్ 06

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండల పరిధిలోని వైబియన్ పల్లిలో భారతీయ జనతా పార్టీ 46వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం బీజేపీ నాయకులు పోతుగుంట రమేష్ నాయుడు బిజెపి జెండాను ఎగరవేశారు.
ఈ సందర్భంగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ అంత్యోదయ స్ఫూర్తితో సుపరిపాలన లక్ష్యంగా సేవయే పరమావధి,దేశమే ప్రథమం అంటూ జనసంఘ్ కాలం నుండి నేటి వరకు పార్టీ జెండాను మోసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం.
దేశ సేవకే అంకితమై, నిరంతరం శ్రమిస్తున్న కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మూర్చ పూర్వ రాష్ట్ర కార్యదర్శి పట్టు పోగుల ఆదినారాయణ ఎస్సీ మోర్చా జోనల్ ఇంచార్జ్ రమణయ్య బిజెపి పట్టణ అధ్యక్షులు వివి రమణ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి గిరీష్ మాజీ మండలాధ్యక్షురాలు ప్రభావతి బిజెపి సీనియర్ నాయకుడు తోట నగేష్ పట్టణ కార్యదర్శి శివమణి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *