ఎన్టిఆర్ విగ్రహానికి పూలవేసి ఘన నివాళులర్పించిన టీడీపీ గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ దగ్గుపాటి
కడప జిల్లా మార్చి 29
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండల
పరిధిలోని కూచివారిపల్లిలోని ఆర్చి వద్ద ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఆదివారం తెలుగుదేశం 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను తెలుగుదేశం గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ దగ్గుబాటి వేంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
దగ్గుపాటి వెంకటేశ్వర నాయుడు టిడిపి శ్రేణులతో కలిసి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ రాష్టం కూటమి పాలనలో సుబిక్షంగా ఉందని సంక్షేమపథకాలు సూపర్ సిక్స్ అమలు చేయడమే కాక ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వని పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప
ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,విద్య,ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ లు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

