తెలుగుదేశం జెండా ఆవిష్కరించి జై తెలుగు దేశం జై జై తెలుగుదేశం అంటు నినాదాలు చేసిన పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల శ్రీనివాసులు, కొలిమివీధి పరిధిలోని 19,20 వార్డులలోని
తెలుగుదేశం కుటుంబ సభ్యులు
కడప జిల్లా మార్చి 29
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని 5వ వార్డు పాఠశాల వద్ద ఆదివారం తెలుగుదేశం 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను తెలుగుదేశం పట్టణ ప్రధానకార్యదర్శి అడపాల శ్రీనువాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
అడపాల శ్రీనివాసులు టిడిపి శ్రేణులు కలిసి తెలుగుదేశం జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అడపాల శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్టం కూటమి పాలనలో సుబిక్షంగా ఉందని సంక్షేమపథకాలు సూపర్ సిక్స్ అమలు చేయడమే కాక ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వని పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప
ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,విద్య,ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ లు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు ఒదేటి హరి ప్రసాద్,సిరిశెట్టి వెంకట చలపతి,వార్డ్ అధ్యక్షులు కీర్తిపాటి వాసు దేవా రాజు,కొండిపాటి ప్రభాకర్ ఉద్దండం వెంకటేష్, తిరుపతి వజ్ర నరసింహ,
వి.శివశంకర్,ఎస్.భాష,
కె.నాగభూషణం ఆచారి,నటరాజ ఆచారి,మధు స్వామి తదితరులు పాల్గొన్నారు

