ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలు

Spread the love

ఎన్టిఆర్ చిత్రపటానికి పూలవేసి ఘన నివాళులర్పించిన టీడీపీ గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డెయ్య

కడప జిల్లా మార్చి 29

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట ఫ్లె ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఆదివారం తెలుగుదేశం 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను తెలుగుదేశం గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డెయ్య నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కొల్లి రెడ్డెయ్య నాయుడు టిడిపి శ్రేణులతో కలిసి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నవీన్, మంద శ్రీనులు మాట్లాడుతూ రాష్టం కూటమి పాలనలో సుబిక్షంగా ఉందని సంక్షేమపథకాలు సూపర్ సిక్స్ అమలు చేయడమే కాక ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వని పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప
ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,విద్య,ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ లు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *