కడప జిల్లా ఏప్రిల్
(నవ్యంధ్ర వార్త పత్రిక )
రాజంపేట పట్టణంలోని గడ్డివీధిలో వెలసియున్న శ్రీ బసవేశ్వర స్వామి మఠంలో సోమవారం అక్షయతదియ, శ్రీ బసవ జయంతిని పురస్కరించుకొని శ్రీ ఉమా మహేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు రుద్రమూర్తి కుటుంబసభ్యులు, కనుల పండువగా నిర్వహించారు. పట్టణ,పరిసర
ప్రాంతాలలోని భక్తాదులు ఆశేషంగా పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ ఉమా మహేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి
శ్రీ ఉమామహేశ్వర్ల కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు.

