రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ తో పాటు మరో ఐదు ర్యాంక్ లు రాజు హై స్కూల్ విద్యార్ధుల సొంతం
ప్రథమ ర్యాంక్ సాధించిన ఎం.చేతన్ వాత్సవ్
కడప జిల్లా ఫిబ్రవరి 12
(నవ్యంధ్ర న్యూస్ )
ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథ మ్యాటిక్స్ ఉపాధ్యాయ
ఆసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 నవంబర్ లో నిర్వహించిన 52వ ఒలంపియాడ్ ప్రతిభ పరీక్షలో రాజంపేట రాజు హై స్కూల్ లో విద్యను అభ్యసిస్తున్న ఐదవ తరగతి విద్యార్ధులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ తో పాటు మరో ఐదు ర్యాంక్ లు సాధించి విజయ దుందుభి మోగించారు. ఒలంపియాడ్ ప్రతిభ పరీక్షలో ఎం.చేతన్ వాత్సవ్ ప్రథమ ర్యాంక్ సాధించగా సి.సాహిత్, జె.మౌనిష్, బి.గురు గౌరవ నందన్ రాయల్, జీ.గురుహరిని ఏడవ ర్యాంక్ సాధించగా టి.ఈషా రాయల్ ఎనిమిదవ ర్యాంక్ సాధించింది. ఒలంపియాడ్ రాష్ట్ర స్థాయిలో టాలెంట్ టెస్ట్ లో ఆరు మంది విద్యార్థులు ర్యాంక్ లు సాధించడం పట్ల రాజు హై స్కూల్ సీఈఓ గుంటిమడుగు రఘురామరాజు, హెచ్ఎం వి.మోహన్ రెడ్డి,లోయర్ సెక్షన్ ఇంచార్జ్ ఎస్ఎండి హబీబ్,గణితం ఉపాధ్యాయిని జీ.సుప్రియలు ఈ సందర్బంగా ర్యాంక్ లు సాధించిన విద్యార్ధులను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో తమ పాఠశాల విద్యార్థులు ర్యాంక్ లు సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసి మాట్లాడుతూ. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా విద్యార్ధుల తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని సిఈఓ గుంటిమడుగు రఘురామరాజు, హెచ్ఎం వి.మోహన్ రెడ్డి లు అన్నారు.

