9 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకుని ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అన్నమయ్య జిల్లా జులై 22
( నవ్యాంధ్ర న్యూస్ )
ఓబుళవారిపల్లి మండలపరిధిలోని సి కమ్మపల్లి దళితవాడకు చెందిన ఈశ్వరమ్మ ఇంట్లో జులై 14వ తేదీ జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఎడు రోజులలో ఛేదించారు.
ఈ కేసులో 9 తులాలు
బంగారు నగలు స్వాధీనం చేసుకుని చోరికి పాల్పడ్డ ఈశ్వరమ్మకు సమీప బంధువులైన ఇద్దరు మహిళలు రమాదేవి సుబ్బమ్మలను రిమాండ్ కు తరలించినట్లు రాజంపేట ఎఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే,రైల్వేకోడూరు సిఐ వెంకటేశ్వర్లు,స్థానిక ఎస్సై మహేష్ నాయుడు లు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు

