ఎన్డీయే మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్

Spread the love

(నవ్యంధ్ర న్యూస్ )

డిసెంబర్ 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే “అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన” యాత్రలో పాల్గొనాలని నేతలకు పిలుపునిచ్చారు
ఈ సందర్బంగా టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ
వాజ్ పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ డిసెంబర్ 11వ తేదీ నుంచి 25వ వరకు చేపట్టే
ఈ యాత్రలో 3 పార్టీల నేతలు పాల్గొనాలన్నారు.
రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం సంతోషమని దేశంలో సుపరిపాలనకు
వాజ్‌పేయ్ నాంది పలికారన్నారు.
వాజ్ పేయ్ తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాది వేశాయన్నారు.
వాజ్ పేయి అజాత శత్రువని,ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారన్నారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్ పేయి కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు.
9 సార్లు లోక్‌సభకు,
2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనమని
18 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు
1998లో పోఖ్రాన్–2 అణు పరీక్షలు నిర్వహించి భారతదేశ శక్తి చాటారన్నారు.కార్గిల్ యుద్దంతో శత్రువుకు తిరుగులేని సమాధానం ఇచ్చారని వాజ్ పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశ దశ దిశ మార్చిందని
నాకు వ్యక్తిగతంగా ఆయనతో అనుబంధం ఉందన్నారు.
రాష్ట్రాభివృద్దిలో ఆయన నాడు ఎంతో సహాయం చేశారని. రాష్ట్రం కోసం ఏది అడిగినాకాదనేవారు కాదన్నారు.ప్రజలకు పనికొచ్చే పనులు ఏం చెప్పినా చేస్తారని. పాలసీల రూపకల్పన చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటారన్నారు.
టెలీ కమ్యునికేషన్ రంగం,విమానయాన రంగంలో సంస్కరణలకు నాంది పలికారని
సుపరిపాలన ఏ విధంగా ఉండాలో ఎన్టీఆర్,
వాజ్ పేయ్ ను చూస్తే అర్థమవుతుందన్నారు.
ఎన్టీఆర్ కూడా విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. పట్టుదల,అనునిత్యం మంచి చేయాలనే ఆలోచనతో ఉండేవారన్నారు.
నాడు అణు పరీక్షలు అయినా,నేడు సింధూర్ అయినా, నాడు చతుర్భుజి అయినా నేడు సాగరమాల అయినా అవి ఎన్డీయే పాలనలో విజయ
వంతమైన కార్యక్రమాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని 2047కు నెంబర్ వన్ చేసేందుకు పని చేస్తున్నారని 2047 నాటికి ఇండియా, ఇండియన్స్ నెంబర్ స్థానానికి వెళ్తారన్నారు. యువతరానికి మోదీ ఒక స్ఫూర్తినిస్తున్నారని.
వాజ్‌పేయ్ శతజయంతి కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని
అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన
కార్యక్రమాన్ని విజయంతం చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *