అన్నమయ్య జిల్లా డిసెంబర్ 22
(నవ్యంధ్ర న్యూస్ )
ఏడుకొండల వాడ వెంకటరమణ స్వామి
నీపై 32 వేల సంకీర్తనలు రచించి,గానం చేసి తిరుమల కొండను విశ్వవ్యాప్తం చేశాను స్వామి.భక్తులు మీకు కానుకలు వేసేందుకు హుండీ ఏర్పాటు చేసింది నేనే కదయ్యా ఆ హుండీ ఆదాయంతోనే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది.
నేను ఇంతచేసినా
నా జన్మ స్థలమైన తాళ్ళపాక అభివృద్ధి పట్టించు కోలేదు. చివరికి నాపేరుతో అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసి రాయచోటిలో పెట్టారు వెంకటేశ్వరా.
నేను పుట్టిన ప్రాంతానికి నా పేరుతో జిల్లా ఏర్పాటు చేసేలా చంద్రబాబు నాయుడుకు ఆలోచన కలిగించు స్వామి. నేను ఏనాడు ఏ కోరిక కోరలేదు. నేను పుట్టిన ప్రాంతాన్ని జిల్లా చేసి నా పేరు పెట్టేలా కూటమి ప్రభుత్వానికి ఆలోచన ప్రసాదించు స్వామి అని భవన నిర్మాణ కార్మికులు అలివేలు మంగ,లక్ష్మి వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య,గణపతి వేసాధరణలో నిరసన తెలియజేశారు.

