కడప జిల్లా మార్చి 26
(నవ్యంధ్ర న్యూస్ )
ఎకశిల నగర ఒంటిమిట్టలో వెలసియున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా శ్రీరామనవమి మహోత్సవాలు
భక్తిశ్రద్ధల నడుమ
నేటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 5వ తేదీ ఘనంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా స్వామి వారికి తెలుగుదేశం రాజంపేట నియోజకవర్గ ఇంచార్జీ చమర్తి జగన్ మోహన్ రాజు దంపతులు పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా, వేద మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించాయి.
ఈ మహోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సేవలు అందించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

