ప్రజా స్వామ్యంలో కక్ష సాధింపు తగదు
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండే పాత్రికేయుల పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగవని ఎపిడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి అన్నారు.
రాజంపేట (నవ్యంధ్రన్యూస్)
సాక్షి ఎడిటర్ రక్కాసి ధనుంజయ రెడ్డి ఇంటిలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం పోలీసులతో తనిఖీలు నిర్వహించడాన్ని నిరసిస్తూ మండలపరిధిలోని ఎస్ ఎర్రబల్లిలోని ఎఎస్పి కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు ఐసి.వెంకట రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం
ఏపీడబ్ల్యూజే నాయకులు నినాదలు చేస్తూ నిరసన తెలిపి ఎఎస్పి మనోజ్ రాంనాథ్ హెగ్డే కి వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి – ప్రజలకు పాత్రికేయులు వారదులుగా ఉండి సమాచారం అందజేసే పాత్రికేయులను పోలీసులు ఇబ్బందిపెడుతూ వ్యవహరించడం అంటే ప్రశ్నించే గొంతుకను నొక్కేయడమేనన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాల పై సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి సాక్షి దినపత్రికలో వార్తా కథనాలను ప్రచురింస్తే ప్రభుత్వానికి నేరంగా కనిపించిందన్నారు. ఇలాంటి విధానాలు ప్రభుత్వ విడనాడాలని డిమాండ్ చేశారు. భయబ్రాంతులతో, సంకెళ్ళతో ప్రజా గొంతుకను నొక్కలనుకోవడం అవివేకమన్నారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు బచ్చోటి భాస్కర్, ప్రతినిధులు మోడపోతుల రామ్మోహన్, తేజం రవిచంద్ర ప్రసాద్, పివిఆర్ కే. రాయులు, గుర్రంకొండ త్రివిక్రమ్, మద్దికర ఓబిలేసు, తుపాకుల సురేష్,
డి నాగేంద్రప్రసాద్, బాలిపోగు సునీల్, మండ్ల శ్రీహరి, చామంచి వెంకటసుబ్బయ్య, చౌడవరం నరసింహ, తదితరులు పాల్గొన్నారు.