ఇద్దరు బావమర్దులను ఒకేసారి త్రిశూలంతో పొడిచి హత్య చేసిన బావ

Spread the love

దంపతుల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరు నిండు ప్రాణాలు తీసింది.

తమ అక్కతో గొడవ పడుతున్నాడని.. బావపై ఇద్దరు బావమర్దులు గొడవకు దిగారు.

అ సంఘటన పెద్ద ఘర్షణగా మారింది.

చివరికి బావ, తన ఇద్దరు బావమర్దులను హత్య చేశాడు.

ఈ దారుణ ఘటన

అల్లూరి సీతారామరాజు జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ )

జీకే విధి మండలం చింతపల్లి క్యాంపులో చోటు చేసుకుంది.

కిముడు కృష్ణ, కిముడు రాజులను వాళ్ల బావ గెన్ను ఒకేసారి ఇద్దరినీ శూలంతో పొడిచి హత్య చేశాడు.

ఈ ఘర్షణను అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి.

మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం సీలేరు ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వ్యక్తి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై పోలీసుల విచారణ లో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *