ఆలయ అభివృద్దే లక్ష్యంగా అందరం కలసి కృషి చేద్దాంతెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి

Spread the love

ఘనంగా ఆలయ అధ్యక్ష,
పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం.

చమర్తికి కృతజ్ఞతలు తెలియజేసిన నూతన ఆలయ అధ్యక్షులు

కడప జిల్లా జనవరి 28

(నవ్యంధ్ర న్యూస్ )

ఆలయ అభిరుద్దే లక్షంగా ప్రతి ఒక్కరూ సేవాభావంతో పని చేయాలని తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.
రాజంపేట పట్టణంలోని తిరుపతి = కడప ప్రధాన రహదారిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం అధ్యక్ష,పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని
విత్రమైన ఆలయంలో సేవ చేసే అదృష్టం లభించినదని పాలకవర్గ సభ్యులు అభిరుద్దే లక్షంగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావలని చమర్తి ఆకాంక్షించారు
ఆలయానికి పట్టణ,
పరిసర ప్రాంత భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండాచూసుకోవాలని,స్వర్థబుద్ధితో పని
చేయకూడదని.స్వర్ధ బుద్ధితో పనిచేస్తే
ఆ దేవుడే శిక్షిస్తాడన్నారు
ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో టిడిపి నాయకులు
మాట్లాడుతూ,చమర్తి సారథ్యంలో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేశారన్నారు.
ఆలయ అధ్యక్షులు తలిశెట్టి రమేష్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన చమర్తి జగన్ మోహన్ రాజుకు కృతజ్ఞతలు తెలిపి అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
అనంతరం చమర్తి జగన్ మోహన్ రాజును నూతన ఆలయ అధ్యక్షులు తలిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు, ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *