ఆర్టీసీ పెట్రోల్ బంక్ లో ఫోన్ పే ద్వారా నగదు చెల్లింపులు నిషేధం
అన్నమయ్య జిల్లా ఆగస్టు 08
( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ యాజమాన్యం పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఇటీవల ఫోన్ పే లావాదేవీలు లేకపోవడంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్టీసీ బస్సులలోనే చార్జీలు ఫోన్ పే లావాదేవీలు జరుపుతున్న ఆర్టీసీ యాజమాన్యం పెట్రోల్ బంకులో ఫోన్ పే లావాదేవీలు నిషేధించడం ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు ఫోన్ పే లావాదేవీలు నిషేధించడం పై ఆర్టీసీ డిపో మేనేజర్ ను వివరణ అడిగేందుకు చరవాణి ద్వారా ప్రయత్నించగా డిపో మేనేజర్ చరవాణిలో అందుబాటులో లేరు పరిసర ప్రాంతాలలో విచారించగా డిసెంబర్ నుంచి ఆర్టీసీ పెట్రోల్ బంక్ లో ఫోన్ పే ధ్వారా జమఐన నగదు లావాదేవీలు వ్యక్తిగత ఖాతాలో జమ ఐనట్లు సమ్మెదిత అధికారులు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం

