అయ్యాదయచేసి ఈ ఒక్కసారికి అనుమతించండి.

Spread the love

ఒక్క నిమిషం నిబంధనలతో విద్యార్థుల భవిష్యత్ నాశనం చెయ్యద్దని కంటతడి పెట్టుకున్న విద్యార్థులు.

కడప జిల్లా ఫిబ్రవరి 23

(నవ్యంధ్ర న్యూస్ )

రాష్టంలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుండగా,మంగళవారం సెకండియర్ విద్యార్థులు తమ పరీక్షలకు హాజరు
కానున్నారు. పరీక్షల నిర్వహణ నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 15వందల 37 కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. పరీక్ష సమయానికి ‘ఒక్క నిమిషం ఆలస్యమైనా’ లోపలికి అనుమతించేది లేదని అధికారులు ముందే స్పష్టం చేశారు.
కొంతమంది పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో వారిని గేటు వద్దే సిబ్బంది ఆపేశారు లోపలికి పంపించాలని గేటు వద్ద నిలబడి ఎదురు చూస్తున్నారు విద్యార్థులు ట్రాఫిక్‌ కారణంగా ఆలస్యం అయ్యిందని
ఈఒక్కసారికి అనుమతించాలని విద్యార్థులు,తల్లిదండ్రులు వేడుకున్నారు.. సిబ్బంది అనుమతించక పోవడంతో విద్యార్థులు కంటతడి పెట్టారు. ఈ ఒక్కసారికి అనుమతించాలని గేటు దగ్గరే.. నిలబడి కన్నీరుపెట్టుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా
ఈ సంవత్సరం మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 5,31,275 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఉండగా.. 5,26,264 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోరని, ముందే సెంటర్ కు చేరుకోవాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *