అన్ని సౌకర్యాలు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రం గా ప్రకటించాలనికదం తొక్కిన విద్యార్ధులు

Spread the love

రాయచోటి వద్దు రాజంపేట ముద్దు
అన్న నినాదాలతో
హోరెత్తిన రాజంపేట

జనంలోనూ ఉత్సాహాన్ని నింపిన జై రాజంపేట అన్న నినాదాలు

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 06

(నవ్యంధ్ర న్యూస్ )

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధులు శనివారం కదంతొక్కారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాతబస్టాండ్ వరకు విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అని జై రాజంపేట,
జైజై రాజంపేట అంటూ నినదించారు.
అనంతరం పాత బస్టాండ్ కూడలిలో
మానవహారంగా ఏర్పడ్డారు. ఈసందర్భంగా విద్యార్ధులు మాట్లాడుతూ
జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు రాజంపేటలో అన్ని వసతులు ఉన్నాయని, ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కేంద్ర సాధనా సమితి,
జెఏసి నాయకులు యల్లాటూరు శ్రీనివాసరాజు,అబ్బూరి ప్రభాకర్ నాయుడు,
అబూబాకర్ చిట్వేలి రవికుమార్,
అల్లం సుబ్రమణ్యం, , వర్షిబోయిన సుధాకర్ బాబు, నీలి ఈశ్వరయ్య, చల్లా సుధాకర్ బాబు, రాజశేఖర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *