అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి.

Spread the love

₹5 లకే నాణ్యమైన భోజనం.

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 10

(నవ్యంధ్ర న్యూస్ )

అన్నా క్యాంటీన్ లో పేదల కోసం అందించే ఆహారం నాణ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా,రుచి,శుచిగా ఉండాలని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.
రాజంపేట పట్టణంలోని రోడ్ల అతిథి గృహం వద్ద కూటమి ప్రభుత్వం ఎర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కేంద్రాన్ని బుధవారం తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ పేదల కోసం ప్రభుత్వం ₹5 లకే అల్పాహార,భోజన సదుపాయం
కల్పిస్తుందన్నారు.ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ లో భోజనానికి ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.
ఎంతమందికి టోకెన్లు ఇస్తున్నారు,భోజనం నాణ్యత ఎలా ఉంది,
ఏమైనా లోపాలున్నాయా వంటి వివరాలను నిర్వాహక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో చమర్తి వెంట పలువురు
నాయకులు,కార్యకర్తలు అభిమానులు
పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *