అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకను అన్నివిధాల అభివృద్ధి చేయాలి
కడప జిల్లా మార్చి 16
( నవ్యంధ్ర న్యూస్ )
ఏకశిలా నగరం ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవస్థానంలో సోమవారం ప్రారంభించనున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు
బిఆర్ నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు విచ్చేసిన సందర్బంగా రాజంపేట తెలుగుదేశం సీనియర్ నాయకులు కొండూరు శరత్ కుమార్ రాజు,గ్రామీణ అధ్యక్షులు రవికుమార్,కార్యదర్శి గాదెరాజు వెంకట సుబ్బరాజ,కొండూరు విశ్వనాధ్ రాజు, మల్లికార్జున రాజులు శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని,విద్యార్థులు సాదరంగా ఆహ్వానించి శాలువా,మెమొంటోలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా కొండూరు శరత్ కుమార్ రాజు మాట్లాడుతూ ఎకశిల నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో నిత్య అన్నదానాన్ని ప్రారంబించిన తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షులు బిఆర్ నాయుడుకు ధన్యవాదములు తెలిపారు.అన్నమయ్య 108అడుగుల విగ్రహం వద్ద నిత్య అన్నదాన పథకాన్ని అమలు చేసి, అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాకను అన్ని విధాల అభివృద్ధి చేయాలని విన్నవించారు.
కొండూరు శరత్ కుమార్ రాజు విన్నవించిన విన్నపానికి తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షులు బిఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారన్నారు.

