అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మేడసాని మోహన్.
రాజంపేట (నవ్యంధ్రన్యూస్)
పద కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమాచార్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తామని తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ అన్నమాచార్య ప్రాజెక్టులో తాను చాలా సంవత్సరాలు పనిచేశానని అన్నమాచార్య జన్మస్థలి తాళ్లపాక గ్రామం పై అవగాహన కూడా ఉందని తెలిపారు. అయితే తాను పదవి విరమణ పొందిన కూడా తనకు తాళ్లపాకపై అవగాహన ఉందనే నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు లు అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ గా తిరిగి బాధ్యతలు అప్పగించడంతో స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంతో పాటు తాళ్లపాక అభివృద్ధికి కృషి చేసేందుకు మళ్లీ అవకాశం వచ్చిందని సంతోషపడుతున్నానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పజెప్పిన ముఖ్యమంత్రి చంద్ర బాబు, టిటిడి చైర్మన్ డిఆర్ నాయుడు ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాళ్లపాకను అభివృద్ధి చేసేందుకు బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే మొదటగా ఈరోజు అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక గ్రామాన్ని, అన్నమయ్య థీమ్ పార్క్ ను సందర్శించి ఈనెల 12 నుంచి జరగనున్న అన్నమయ్య జయంతి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు. పర్యటనలో భాగంగా ఆయన ముందుగా అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్దకు చేరుకుని తాళ్లపాక మాజీ సర్పంచ్ ఉద్దండం బ్రహ్మయ్య కుమారుడు ఉద్దండం సుబ్రహ్మణ్యం , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుకుంట రమేష్ నాయుడు లతో కలిసి అక్కడ నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, సంగీత సభలు నిర్వహిస్తున్న వేదికను, ఊంజల సేవ నిర్వహిస్తున్న మండపాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టిటిడి తాళ్లపాకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదని భక్తులకు కళాకారులకు కనీస సౌకర్యాలను కల్పించి తాళ్లపాక అభివృద్ధికి చేపట్టవలసిన పనులపై ఉద్దండం సుబ్రహ్మణ్యం పోతుకుంట రమేష్ నాయుడులు మేడసానికి వినతి పత్రాన్ని అందజేసి తాళ్లపాక అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం తాళ్లపాక గ్రామానికి చేరుకుని అన్నమాచార్యుల ధ్యాన మందిరంలో అన్నమయ్య మూలవిరాట్ వద్ద తాళ్లపాక గ్రామస్తులు, బిజెపి నాయకులు నాగోతు రమేష్ నాయుడు, న్యాయవాది సురేష్ రాజు, అదృష్టదీపుడు జవ్వాజి మోహన్ , ఇతర గ్రామ పెద్దలతో కలిసి ధ్యాన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్యాన మందిర పరిసర ప్రాంతాలను చెన్నకేశవ సుదర్శన్ చక్ర ఆలయాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మేడసాని వద్దకు చేరుకుని తాళ్లపాకలో అన్నమయ్య జయంతి వర్ధంతి ఉత్సవాలతో పాటు చెన్నకేశవ సిద్దేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పేలవంగా నిర్వహిస్తున్నారని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ మేడసాని మోహన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఒక్కొక్క సమస్యపై మేడసానికి విపులంగా వివరించి తాళ్లపాక అభివృద్ధికి సహకరించాలని కోరారు. స్పందించిన మేడసాని మోహన్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచానికి తన సంకీర్తన రూపంలో తెలియజేసిన మహానుభావుడు తొలి వాగ్గేయ కారుడు అన్నమయ్య కు ఎంత చేసినా తక్కువేనని ఆయన జయంతి , వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తాళ్లపాకను అన్ని హంగులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ,జేఈవో వీరబ్రహ్మం లో సుముఖంగా ఉన్నారని వారి సహకారంతో తాళ్లపాక అభివృద్ధి విషయాలను ఇక్కడ చేపట్టవలసిన పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చివరగా బిజెపి నాయకులు నాగోతు రమేష్ నాయుడు సెల్ ఫోన్ లో నుంచి అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో మాట్లాడి అన్నమయ్య జయంతి ఉత్సవాలకు శ్రీవారి కల్యాణోత్సవానికి మీరు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఉత్సవాలను విజయవంతం చేసేందుకు తాళ్లపాక గ్రామస్తులతో పాటు రాజంపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అన్నమయ్య భక్తులు ప్రతి ఒక్కరూ తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సీనియర్ అసిస్టెంట్ లోకనాథ్ రెడ్డి, అన్నమయ్య జయంతి ఉత్సవాల కోఆర్డినేటర్ లత, తాళ్లపాక గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.