అకేపాడు ఆసుపత్రి అవినీతి బాగోతం పై ఉన్నతాధికారులు విచారణ జరిపి అవినీతికి కారణమైన వారి పై చర్యలు తీసుకోవాలి.
చిలికి చిలికి గాలి వానగా మారుతున్న ఆకేపాడు ఆసుపత్రి వివాదం.
ఎంపీడీవో పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాన వైద్యులు.
ఆసుపత్రి నిధులు కాజేశారని ప్రధాన వైద్యుల పై ఆరోపణలు.
వారం వారం వేయాల్సిన టీకా మందులు వేయడం లేదని ఫిర్యాదులు.
ఆశ వర్కర్ల సమావేశాలే నిర్వహించడంలేదని గగ్గోలు.
కడప జిల్లా ఫిబ్రవరి 04
(నవ్యంధ్ర న్యూస్ )
జిల్లాలో అతి పెద్ద ఆసుపత్రిగా పేరు గాంచిన రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు ఆరోగ్య కేంద్ర అవినీతి బాగోత వివాదం ఒక్కసారిగాభగ్గుమంది.ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రధాన వైద్యుడు సక్రమంగా పని చేయకపోవడంతో
మండల ప్రజల ఆరోగ్యం పై పడిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల ఎంపీడీవో పై ప్రధాన వైద్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగించిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారి మండల స్థాయిలో పెద్ద చర్చిగా మారింది.మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో నిర్వహించాల్సిన
సచివాలయాలవ్యవస్థలపై మండల అభివృద్ధి అధికారికి అధికారం లేదని మండల అభివృద్ధి అధికారి ఆదేశాలను పట్టించుకోవద్దని అన్ని నేనే చూసుకుంటానని మీకు నేను ఉన్నానని మండల అభివృద్ధి అధికారితో ఏం పని అని చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి.
వివరాల్లోకెళితే ..
అకేపాడు ఆరోగ్యకేంద్రం లో ఓ ప్రధాన వైద్యులు తన కుటుంబ రాజకీయ నేపథ్యంతో ఆకేపాడు ప్రధాన వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న
ఓ రాజకీయకుటుంబాన్ని చెందిన వైద్యుడినని నన్ను ఎవ్వరు ఏమి చేసుకుంటార్లే అన్న ధీమా స్థానిక వైసీపీ నాయకునిఅండదండలు పుష్కలంగా ఉన్నందున్న ఈ వైద్యులు ఏడు సంవత్సరాలుగా ఈ ఆరోగ్యకేంద్రంలోనే విధులు నిర్వర్తిస్తున్నాడని శాసన సభ్యులుఅమర్నాథరెడ్డి మండల ఉపాధ్యక్షులు రంగారెడ్డిల స్వగ్రామంలోని ఆరోగ్యకేంద్ర కావడం
ఈ ఆరోగ్యకేంద్ర వ్యవహారాలు ప్రధానంగా వీరే చూస్తూన్న ఈ వైద్యుడు ఆడిందే ఆట పాడిందే పాట.
ప్రధాన వైద్యుడు విధులకు రాకుండానే క్యాంపుకు వెళ్లినట్లు మాస్టర్ వేసుకుంటూ తనకు కావాల్సిన సిబ్బంది విధులకు గైహాజరైన,హాజరైనట్లు చూపిస్తూ అనేకమంది సిబ్బందిని పని దొంగలుగా మారుస్తున్నట్లు సమాచారం.
ఈ ఆరోగ్యకేంద్ర పరిధిలోని గ్రామాలలో వంద మందికి పైబడి సిబ్బంది పనిచేస్తున్నారని
యధా రాజా తథా ప్రజా అన్న చందంగా ప్రధాన వైద్యులే విధులు సక్రమంగా నిర్వర్తించక పోయినా వైద్యులు, సిబ్బందికి ఆ వైద్యులు మాస్టర్లు వేసుకుంటే సక్రమంగా విధులు నిర్వర్తించే సిబ్బంది పరిస్థితి ఏమిటని సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మస్టర్ల వ్యవహారాన్ని సంబంధిత ఉన్నతాధికారులు ఫేస్ రికగ్నిషన్ సిస్టంలో పరిశీలిస్తే వీరి వ్యవహారం తేటతెల్లమౌతుంది.
ఈ వ్యవహారంలో సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల సిబ్బంది,ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి నెల పల్లె ప్రాంతాలలో ఆశ వర్కర్ల పరిస్థితి ఆగమ్య గోచరం. 50 మంది ఆశా వర్కర్లు అ గ్రామాల పరిధిలోని తల్లి బిడ్డల బాగోగులు, ప్రభుత్వా నివేదికలను సమర్పించాలని.
ప్రతినెల ప్రధాన వైద్యులు సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా ప్రధాన వైద్యులు గత నాలుగు నెలలు పైబడి ఆశ వర్కర్ల సమావేశాలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తూ న్నందున గ్రామీణ ప్రాంతాలలో సరైన సేకరణనిర్వహించడం లేదని,ప్రతి శని బుధవారాలలో చిన్న పిల్లలకు వేయవలసిన టీకా మందులు సక్రమంగా వేయడంలేదని ప్రభుత్వం పది వ్యాధులకు పిల్లలకు ముందస్తుగా టీకా మందులు ఉచితంగా ఆయా ఆరోగ్యకేంద్ర వైద్య సిబ్బంది క్రమం తప్పక వేయాలి. సక్రమంగా సరైన సమయానికి వేయకపోతే ఆ టీకా మందుల వల్ల ఉపయోగం ఉండదు. భవిష్యత్తులో
ఆ చిన్నారులు వ్యాధుల బారిన పడక తప్పదని టికా మందులు సక్రమంగా వేయడం లేదని గ్రామస్థులు వాతున్నారు.
ఆరోగ్యకేంద్ర పరిపాలన ఖర్చులు,ఆయా గ్రామ సచివాలయాలలో పనిచేసే సిబ్బంది
పల్స్ పోలియో ఇతరత్రా కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తుందని
ఆ నిధులను కాజేశారని ఈ ఆరోగ్యకేంద్రం నియోజకవర్గ కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందించే ఆరోగ్యకేంద్రం.
ఈ ఆరోగ్యకేంద్రంలో ప్రధాన వైద్యులు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడంతో ఈ ఆరోగ్యకేంద్రం ఆగమ్య గోచరంగా ఉందని ఈ ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తించే సిబ్బంది స్థానికంగా నివాసం ఉండడకపోవడంతో రోగులకు ఈ ఆరోగ్య
కేంద్రంలో వైద్య సేవలు అందడం లేదని ఆదివారం ఈ ఆరోగ్యకేంధ్రానికి తాళాలు వేయడంతో రోగులు చేసేదేమి లేక పట్టణానికి వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించు
కుంటుండడంతో కార్పొరేట్ రీతిలో ఆరోగ్యకేంద్రన్ని ఆధునికరించి నూతన భవనం నిర్మించి,సీసీ కెమెరాలు ఎర్పాటు చేస్తే ఎర్పాటు చేసిన సీసీ కెమెరాలానింటిని పనిచేయకుండా చేశారని సమాచారం.
ఈ ఆరోగ్యకేంద్రంలోని ప్రధాన వైద్యుణి పై వ్యక్తిగతంగా అనేక ఆరోపణలు ఉన్నాయని సిబ్బందితో సక్రమంగా ఉండక కొందరితో అనుకూలంగా ఉంటూ అనుకూలంగా లేని సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నరని ఈ ఆరోగ్యకేంద్రంలో వైద్యం సక్రమంగా నిర్వహించక పోవడంతో ప్రభుత్వం సరఫరా చేసే మందులను సక్రమంగా వినియోగించడం లేదని టీకా మందులు,ఆశా వర్కర్లను,సిబ్బందిచే గ్రామీణ ప్రాంతాలలో వైద్యంఅందించడంలో
ఈ ఆరోగ్యకేంద్రం ఘోరంగా విఫలమైందని ఈ ఆరోగ్యకేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న
14 మంది సిబ్బంది యధారాజా తథా ప్రజలు అన్నట్లు వ్యవహారిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
ఈ ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం పై తక్షణ చర్యలు తీసుకొని ఈ ఆరోగ్యకేంద్రా పరిధిలోని ప్రజలకు,వ్యాధి
గ్రాహస్థులకు మెరుగైన వైద్యం అందేటట్లు చర్యలు తీసుకుని నిర్లక్ష్యంగా,ఎక పక్షంగా వ్యవహరిస్తున్న ప్రధాన వైద్యులు,సిబ్బందిల పై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు
కోరుతున్నారు.

