హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకుని గర్భాశయ క్యాన్సర్ ను అరికట్టండి

Spread the love

కడప జిల్లా మార్చి 12

(నవ్యంధ్ర న్యూస్ )

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ను రాజంపేట మన్నూరు ప్రాథమిక సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్ పివీ వ్యాక్సిన్ గురువారం మన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా వైద్యాధికారి డాక్టర్ సౌజన్య ఆధ్వర్యంలో హెచ్ పీవీ వాక్సిన్ బాలికలకు వేసి ప్రారంభించినారు
ఈ కార్యక్రమంలో ప్రధాన ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ నాగేశ్వర రాజు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ వో డాక్టర్ చెన్నకృష్ణ,మున్సిపల్ కమిషనర్ లక్ష్మీనారాయణ లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 14సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్ పి వీ వ్యాక్సిన్ వేయించుకుంటే ,గర్భాశయ క్యాన్సర్ ను అరికట్ట వచ్చన్నారు.మూడు నెలలు నిర్వహించే హెచ్ పి వి వ్యాక్సిన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి వ్యాక్సిన్ వేయించు కోవాలన్నారు.ఎటువంటి ప్రమాదము ఉండదని బాలికలకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ చెన్నమ్మ డిఈఓ నీరజ,
హెల్త్ సూపర్వైజర్ వెంకటసుబ్బయ్య,ఏఎన్ఎం ఏనం విజయకుమారి, ఫార్మసిస్ట్ నాగరాజు,
ల్యాబ్ టెక్నీషియన్ జమీరుల్లాలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *