తహసిల్దార్ దస్తగిరయ్య
కడప జిల్లా ఏప్రిల్ 17
(నవ్యంధ్ర న్యూస్ )
గృహ గణన కార్యక్రమానికి రాజంపేట మండలంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని తహసిల్దార్ దస్తగిరయ్య అన్నారు .
స్థానిక డిగ్రీ కళాశాలలో శుక్రవారం సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో దస్తగిరయ్య మాట్లాడుతూ గృహ గణన విధానం, దశలు,ప్రజల పాత్ర పై విపులంగా వివరించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ‘స్వీయ ఎనుమరేషన్’ | ప్రక్రియ నిర్వహించ
బడుతుందని,
ఈ వ్యవధిలో ప్రజలు https://se.census.gov.in పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదుచేసుకోవచ్చన్నారు.ఈవిధానంలోప్రప్రథమంగా, మండలంలోని
ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు,విధ్యార్థులు స్మార్ట్ ఫోన్ వినియోగించే వారు డిజిటల్ సౌకర్యాలను వినియోగించుకుని స్వచ్ఛందంగా వివరాలు నమోదు చేయడం ద్వారా గణన ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు.
స్వీయ నమోదు పూర్తయిన తర్వాత వారికి జనరేట్ అయిన ఐడిని మే 1 వ తారీకు నుండి ఇంటింటి గణన చేపట్టేందుకు వొచ్చే సచివాలయ అధికారులకు చెప్పి మీ స్వీయ గణనను ఆన్లైన్ ద్వారా గణన అధికారుల ద్వారా ఆమోదించుకోవలన్నారు.
డేటాధృవీకరణసులభతరం అవుతుందన్నారు.
ఇక గణన తొలి దశగా రాష్ట్ర వ్యాప్తంగా మే 1వ తేదీ నుండి భవనాల గణన మాత్రమే చేపడతామని,
ఈ దశలో ఇళ్ల నిర్మాణం, సౌకర్యాలు,నివాస పరిస్థితులు వంటి వివరాలు సేకరిస్తారన్నారు.
ఈ ప్రక్రియలోఎనుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే సమయంలో ప్రజలు సరైన సమాచారాన్ని
అందించాలని,ఎటువంటి అపోహలు లేకుండా సహకరించాలన్నారు.
గృహ గణన ద్వారా ప్రభుత్వానికి ప్రజల అవసరాలు,సామాజిక-
ఆర్థిక పరిస్థితుల పై స్పష్టమైన అవగాహన లభిస్తుందని,తద్వారా ప్రజల ఆర్థిక స్థితులను, జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు అవసరమైన సంక్షేమ పథకాల రూపకల్పన సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రైని సిబ్బంది,గణనఅదికారులు, పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

