అన్నమయ్య జిల్లా 11
(నవ్యంధ్ర న్యూస్ )
మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పథకం ప్రవేశపెట్టిందని, ఈ పథకం మత్స్యకారులకు ఎంతో ఉపయోగ
పడుతుందని తెలుగుదేశం నియోజక
వర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.
నందలూరు మండలపరిధిలోని కోనాపురం సోమశిల బ్యాక్ వాటర్ లో పర్యటిస్తూ మత్స్యశాఖ అధికారులు, పార్టీ నాయకులతో కలసి చమర్తి చెరువులో చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఈపథకాన్ని
తీసుకొచ్చిందన్నారు.
మత్స్యకారుల ఉపాధిని మెరుగుపరిచి,
మత్స్యకారులను ఆర్థికంగా స్థిరపడలనే లక్ష్యంతో నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు.చేపపిల్లల పెంపకాన్ని పక్కాగాపర్యవేక్షించాలని,నిర్లక్ష్యం వహించకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశంనాయకులుకార్యకర్తలు,,మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

