నంద్యాల జిల్లా ఫిబ్రవరి
(నవ్యంధ్ర న్యూస్ )
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి
దేవస్థానంలో
నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,61, 81,535/- రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు,ఈఓ చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు.
ఈ సందర్బంగా శివ దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ భక్తులు, ఫిబ్రవరి 06 తేది నుండి 18 వ తేది వరకు 13 రోజులు నిర్వహించిన మహా శివరాత్రి మహోత్సవాలకు విచ్చేసిన భక్తులు హుండీలో కానుకలుగా సమర్పించారని
ఈ హుండీలో 124 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 5 కేజీల 550 గ్రాముల వెండి,22 – యుఎస్ఏ డాలర్లు, 10 – యు.ఎ.ఇ దిర్హమ్స్,5-సౌదీరియాల్స్,4- సింగపూర్ డాలర్లు, 25 – ఇంగ్లాండు పౌండ్స్, 1 భట్స్ కానుకలు సమర్పించారన్నారు.
ఈ హుండీ లెక్కింపు సిసి కెమెరా,పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ పలువిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు,సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

