శ్రీ వరసిద్ధి వినాయకశ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఎర్పాటు చేసిన మంచుహిమలింగం వద్దశివలింగాలకు భక్తుల చే క్షీరాభిషేకం

Spread the love

కడప జిల్లా ఫిబ్రవరి 15

(నవ్యంధ్ర న్యూస్ )

పరమశివుని పవిత్రమైన మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెంలో వెలసియున్న
శ్రీ వరసిద్ధి వినాయక
శ్రీబాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంచు హిమలింగం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త చంద్రమౌళి మాట్లాడుతూ శివపుత్రులు కొలువై ఉన్న ఈ ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మంచు
లింగం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
మంచు లింగం వద్ద స్పటికలింగం,
గాజులింగాలు అభిషేకాలందుకుంటున్న మరో శివలింగంకు భక్తుల స్వహస్తాలతో క్షీరాభిషేకం చేసుకునే వసతిని
కల్పించామన్నారు. భక్తులు విరివిగా పాల్గొని శివలింగాలకు
స్వహస్తాలతోక్షీరాభిషేకం నిర్వహించారు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు భక్తులు స్వయంగా వారి స్వహస్తాలతో
శివలింగాలకు అభిషేకం చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు భక్తులకు ప్రసాద వినియోగం
నిర్వహించారు . శివపుత్రుల ఎదుట
ఆ మహాదేవునికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలలో పాల్గొనడం ఆధ్యాత్మికంగా అత్యంత పుణ్యదాయకమని. తద్వారా శివపుత్రులుతో పాటు ఆ మహాదేవుని ఆశీస్సులు భక్తులకు అందుకున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *