కడప జిల్లా మార్చి 04
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట – తిరుపతి ప్రధాన రహదారిలోని భువనగిరిపల్లి ఆర్చ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన
“శ్రీ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్”ను తెలుగుదేశం రాజంపేట నియోజకవర్గ ఇన్-ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు బుధవారం
ప్రారంభించారు.
ఈ సందర్బంగా చమర్తి మాట్లాడుతూ,స్థానిక ప్రజలు,ప్రయాణికులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించడం అభినందనీయమని యజమాని కుసులూరు హరికృష్ణను కొనియాడారు.
రెస్టారెంట్ నిర్వాహకులు జగన్ మోహన్ రాజును సాదరంగా ఆహ్వానించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. వ్యాపార రంగంలో యువత ఉత్సాహంగా ముందుకు రావడం
శుభపరిణామమని,
ఈ రెస్టారెంట్ దినదినాభివృద్ధి చెంది వినియోగదారుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్యం,స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

