కడప జిల్లా ఫిబ్రవరి 22
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండలపరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్ నేషనల్
సి.బి.ఎస్.ఈ పాఠశాలలో ఆదివారం కీర్తిశేషులు సయ్యద్ మహమ్మద్ జాన్ జ్ఞాపకార్థం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరానికి విశేషా స్పందన లభించినది.
ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో నియోజకవర్గ పరిసర ప్రాంతాలలోని ప్రజలు ఈవైద్యశిబిరానికి విచ్చేసి ఆరోగ్య పరీక్షలు చేయించుకోన్నారు.
ఈ సందర్బంగా ఉచిత వైద్యశిబిరంలో ఉచిత వైద్యసేవలు
చేయించుకున్న ప్రజలు ఆనందం వ్యక్తం చేసి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులకు ధన్యవాదములు తెలియజేసారు.

