కడప జిల్లా ఫిబ్రవరి 14
(నవ్యంధ్ర న్యూస్ )
2024 ఎన్నికలలో ఘోర ఓటమితో కేవలం 11 స్థానాలు సాధించుకున్న వైసీపీ పుంజుకుందని గట్టిగా నమ్ముతున్నారు జగన్ అభిమానులు.
ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం పై అసంతృప్తి మొదలవ్వడం, ప్రజలు జగన్ పాలనతో పోల్చి చూస్తుండటం పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతోందంటున్నా
వాళ్ళు జగన్ మళ్ళీ పూర్తిగా జనం మధ్యలోకి వెళ్తే ఈ పోలిక ఇంకా పీక్స్ కి వెళ్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ హడావిడి చూసి అప్పట్లో వైసీపీని వదిలేసి వెళ్ళిన వాళ్ళు,కూటమి పార్టీలలో ఉన్న నాయకులకు సంతృప్తి లేదని సంతృప్తి లేని నాయకులు మళ్ళీ జగన్ వైపు చూడటం మొదలు
పెట్టారట. కొందరైతే అప్పుడే తమ కర్చీఫ్ వేసేసి, జగన్ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు చేరతామని వైసీపీ ముఖ్య నేతలకు కబుర్లు పంపిస్తున్నారట.
విచిత్రం ఏంటంటే, బయట మీడియా ముందు జగన్ పై విమర్శలు చేస్తున్న నాయకులు కూడా లోపల వైసీపీ నాయకులతో టచ్ లో ఉంటున్నారట. అధిష్టాన ఒత్తిడి వల్ల విమర్శలు చేయాల్సి వస్తోందని, మనసు మాత్రం వైసీపీ పై ఉందని సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ చుట్టూ మళ్ళీ తట్టుకోగలమా అనే టెన్షన్ కూటమి నాయకులలో మొదలైందంటున్నారు. . ఎవరెవరు మళ్ళీ పార్టీలోకి వస్తారో, జగన్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాలి.

