కడప జిల్లా మార్చి 06
(నవ్యంధ్ర న్యూస్ )
వైయస్సార్సీపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు చొప్ప ఎల్లారెడ్డి రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులయ్యారు. వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చొప్పా ఎల్లారెడ్డినినియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలియజేసింది.
గతంలో రాయచోటి అసెంబ్లీ,మైదుకూరు అసెంబ్లీ,రాయచోటి మున్సిపాలిటీ ఇన్చార్జిగా వైఎస్ఆర్సిపి తరఫున సేవలు అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చొప్పా ఎల్లారెడ్డి మాట్లాడుతూ తనను నియమించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నన్నారు.
తన నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకునిగా అందర్నీ సమన్వయం చేసుకుంటూ రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా పార్టీఅధ్యక్షులు,పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలక సహాయకారిగా వ్యవహరిస్తానన్నారు.

