తిరుపతి జిల్లా ఏప్రిల్ 11
(నవ్యంధ్ర న్యూస్ )
వైసిపి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల కమిటీలో బూత్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా చిట్వేలి మండల వాసి నాగిరెడ్డి రాజేంద్రప్రసాద్ రెడ్డి నియమితులైనట్లు .
ఆ పార్టీ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి శనివారం తెలిపారు.
ఈ సందర్బంగా మీడియాతో రాజేంద్రప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తన పై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి,మాజీ శాసన సభ్యులు కొరముట్ల శ్రీనివాసులు,మండల
కన్వీనర్ చెవ్వుశ్రీనివాసరెడ్డి, జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు వై. శివప్రసాద్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకానికి విధేయునిగా పనిచేస్తూ, పార్టీ ఎదుగుదలకు తను వంతు కృషి చేస్తాన్నన్నారు.

