వీధులలో కుక్కల బెడద నుండి ప్రజలు,పాద, వాహన దారులను కాపాడాలి

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 08

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణంలోని రోడ్ల పై నిరాధార కుక్కల సంచారం తీవ్రంగా పెరిగిందని ప్రజలు,పాద,
వాహనదారులను ప్రతి ఒక్కరిని వెంటపడుతూ ప్రమాదాలకు గురి చేస్తున్నాయని గతంలో మున్సిపాలిటీకి
ఎన్నిసార్లు తెలిపినా చర్యలు కనబడలేదని పలువురు ప్రజలు,పాద,
వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు గాలివీడులో కుక్కలు వెంటపడిన ఘటనలో ఓ వ్యక్తి మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ప్రజలు,పాద,వాహన
దారులు వాపోతున్నారు.
వెంటనే కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని కాలనీలలో గస్తీ బృందాలు పెంచి
మున్సిపాలిటీ తక్షణం స్పందించి వెంటనే కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని
గతంలో సోషల్ మీడియా,నేరుగా మున్సిపల్ కమిషనర్ కి తెలియచేసిన స్పందన లేదని ఉన్నతాధికారులు స్పందించి కుక్కల బెడద నుండి ప్రజలు,పాద, వాహనదారులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *