తిరుపతి డిసెంబర్ 09
(నవ్యంధ్ర న్యూస్ )
ఓ దారుణమైన ఘటన తిరుపతిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న మైనర్ విద్యార్థిని పై ఒక ఆటోడ్రైవర్
అత్యాచారానికి పాల్పడ్డాడు.
పోలీసుల వివరాల మేరకు వివరాలు
ఇలా ఉన్నాయి
ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని వేరే హాస్టల్కు మారే క్రమంలో ర్యాపిడో ఆటో టాక్సీలో రిజిస్టర్ అయిన ఆటో డ్రైవర్ సాయికుమార్ పరిచయమయ్యాడు. వారి మధ్య పరిచయం పెరగడంతో సదరు ఆటో డ్రైవర్ను విద్యార్థిని కొంత ఆర్థిక సహాయం కోరింది. దీంతో అతను ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకున్నాడని పోలీసులు అన్నారు. బాలికను తెలివిగా మభ్యపెట్టి తన గదికి తీసుకెళ్లిన అతను అక్కడ తన నీచ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పారు. అత్యాచార యత్నానికి సంబంధించిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ హేయమైన చర్య తర్వాత బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి ధైర్యం చేసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు.బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు నిందితుడు సాయికుమార్ పై క్రైమ్ నెంబర్ 448/2025, కపొక్సో చట్టం 2012 ప్రకారం కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మైనర్ బాలికపై జరిగిన ఈ అఘాయిత్యం తిరుపతిలో కలకలం సృష్టించింది. ఈ చట్టం పిల్లల పై జరిగే లైంగిక నేరాల నుండి రక్షించడానికే నన్నారు.
ఈ దారుణ ఘటన పై
విద్యాసంస్థలవిద్యార్థులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసులో నిందితుడిని త్వరగా పట్టుకుని, కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, పౌర సమాజం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినుల భద్రత, ముఖ్యంగా హాస్టల్స్, ప్రయాణ సమయంలో వారి రక్షణకు తల్లిదండ్రులు, అధికారులలో తీవ్ర ఆందోళన వ్యక్త మవుతోంది. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని,నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

