మంత్రి సత్య కుమార్ యాదవ్
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడుకు ఘన స్వాగతం
అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06
( నవ్యాంధ్ర న్యూస్ )
విద్యార్థి దశ నుంచి సాధారణ కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదుగుతూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగోతు రమేష్ నాయుడు కృషి అభినందనీయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జమ్మలమడుగు శాసన సభ్యులు ఆదినారాయణ రెడ్డి,ఆదోని శాసన సభ్యులు పార్థసారథి, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్,తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ లు అన్నారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి మొట్ట మొదటిసారిగా రాజంపేట కు విచ్చేసిన నాగోతు రమేష్ నాయుడుకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎబి చంద్రరెడ్డి కల్యాణ మండపంలో శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి సంఘ నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడన్నారు. విద్యార్తి,రైతు,ప్రజల సమస్యల పై అనేక ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళినప్పటికీ బీజేపీలో ఎన్నో పదవులను
పొందారన్నారు.పార్టీలో ఆయన చేసిన కృషిని పలువురు అభినందించారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్టుపోగుల ఆదినారాయణ,బిజెపి సీనియర్ నాయకులు హిమగిరి యాదవ్,బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు అమ్మినేని విజయేంద్ర బాబు, నాయుడు జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్,మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్,జిల్లా నాయకులు,మండల అధ్యక్షులు,బిజెపి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

