అన్నమయ్య జిల్లా డిసెంబర్ 06
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండలపరిధిలోని కారంపల్లి పంచాయతీలో ప్రభుత్వం హిందువులకు కేటాయించిన స్మశాన వాటిక పనులు విక్రమ్ రెడ్డి సహకారంతో ఆదివారం ప్రారంభమైనట్లు శ్రీ కాశీ విశ్వనాథ హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డొంక సురేష్ ఫ్యూచర్ మైండ్స్ పాఠశాలలో కమిటీ సమావేశం నిర్వహించి కమిటీ సభ్యులకు, ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ హిందూ స్మశాన వాటిక పనులు
ప్రారంభించేందుకు సహకరించిన విక్రమ్ రెడ్డికి కాశీ విశ్వనాథ హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు ధన్యవాదములు తెలియజేశారు. దాతృత్వం కలిగిన దాతలు ఎవరైనా ముందుకు వచ్చి దత్తత తీసుకుని హిందూ స్మశాన వాటిక పనులు పూర్తి చేయాలన్నారు.
హిందూ స్మశాన వాటికను దత్తత తీసుకొని పక్షంలో ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులు, ప్రజలు హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి మున్సిపాలిటిపరిధిలోని ప్రజలకుఉపయోగపడేలా హిందూ స్మశాన వాటిక ప్రారంభానికి చేయూత నివ్వాలన్నారు.

