కడప మార్చి 08
(నవ్యంధ్రవార్త న్యూస్ )
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజంపేట పట్టణ శివార్లలోని సిటీ కళ్యాణ మండపంలో ఆదివారం సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన అధ్యక్షతన నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పట్టణపరిధిలోని నూనివారిపల్లి పాఠశాల విధులు నిర్వహిస్తున్న మహిళ ఉపాధ్యాయురాలు రత్నకుమారి,నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,బాలికల జూనియర్ కళాశాలకు చెందిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయిని డాక్టర్
కె శర్వాణి, వ్యాయామ ఉపాధ్యాయురాలు
ఎన్ గౌరీ, పాటూరు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వ్యాయామ
ఉపాధ్యాయురాలు సుస్మిత,గొల్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయిని నాగమల్లేశ్వరిలను తహసీల్దార్ఘ పీరు మున్ని ఘనంగా సత్కరించారు..
ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గంగనపల్లి వెంకటరమణ, ఉపాధ్యాయులు సత్కారం అందుకున్న మహిళ ఉపాధ్యాయి రాలను అభినందించారు.

