అన్నమయ్య జిల్లా జూన్ 29
( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల నిరసన తెలియజేసారు ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ హైదరాబాదులోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై, బిఆర్ఎస్ నేతలు చొరబడి రాళ్లు, కట్టెలతో ధ్వంసం చేయడానికి తీవ్రంగా ఖండింస్తూ ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు
మీడియా కార్యాలయాల పై, దాడులు జరగకుండా ప్రభుత్వాలు తగుచర్యలు తీసుకోవాలని కోరారు

