కడప జిల్లా 19
(నవ్యంధ్ర న్యూస్గం )
రాజంపేట బలిజపల్లి గంగమ్మ జాతరను మే 7వ తేదీ నిర్వహించాలని బలిజపల్లి,తుమ్మల అగ్రహారం గ్రామ జాతర నిర్వాహకులు నిర్ణయించారు. బలిజపల్లికు చెందిన నిర్వాహకులు తుమ్మల అగ్రహారంలో ఆదివారం గ్రామ నిర్వాహకులతో పలు అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి జాతర నిర్ణీత సమయంలో జాతర నిర్వహించాలని తీర్మానించారు. ఇదే సందర్భంలో ఈ ఏడాది ఉగాది తరువాత వస్తున్న 7 వ గురువారం అంటే మే 7వ తేదీ జాతర చేయాలని నిర్ణయించారు. ఇక నారపురెడ్డిపల్లె కు చెందిన జాతర నిర్వాహకులతో బలిజపల్లె జాతర నిర్వాహకులు చర్చించి ఆ గ్రామ నిర్వాహకులు కూడా 7వ తేదీ జాతర నిర్వహణకు సమ్మతిస్తే మే 7వ తేదీ జాతర జరగనుంది.

