అమరావతి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పి.వి.యన్ మాధవ్ సమక్షంలో విజయదశమి సందర్భంగా గురువారం మున్సిపల్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ రేనాటి రాఘవేంద్ర వర్మ,సినీ దర్శకుడు శివమణి రెడ్డిలు భారతీయ జనతా పార్టీ కండువా వేసుకున్నారు ఈ సందర్బంగా మున్సిపల్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ రేనాటి రాఘవేంద్ర వర్మ మాట్లాడుతూ
పార్టీ నిర్ణయమే శిరోధార్యమని తమకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు
నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని..మోడీకి తమ వంతు సహకారం అందించాలని నా లక్ష్యమన్నారు
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ నేతృత్వంలో రాజంపేటలో బిజెపిని బలోపేతం చేస్తామన్నారు
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు బిజెపిలో సముచిత స్థానం దక్కుతుందన్నారు

