కడప జిల్లా జనవరి 27
( నవ్యంద్ర న్యూస్ )
ప్రతి ఒక్క ఆహార వ్యాపారి ఆహార భద్రత శిక్షణ ధ్రువపత్రాలను పొందాలని ఆహార భద్రత శిక్షణరాలు పాలకొలను యశోదా దేవి అన్నారు.
రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహంలో మంగళవారం ఆహార తయారీ వ్యాపారులకు జాతీయ ఆహార భద్రతా సంస్థ ఆమోదించిన ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ యాక్ట్ 2006, 2017 అక్టోబర్ 6 ఇన్ టర్మ్ ఆఫ్ సెక్షన్ 16(3),2011 లైజనింగ్, రిజిస్ట్రేషన్ ఫుడ్ బిజినెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ షెడ్యూల్ 4 ప్రకారంగా వ్యాపారులకు ఆహార భద్రత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఎఫ్ఓఎస్ టిఎసి కార్యక్రమం ద్వారా
ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఆహార భద్రత, ఆహార నాణ్యత,వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా
పాటించాలన్నారు. అమ్మకపుదారులు పరిశుభ్రమైన,నాణ్యమైన ఆహారాన్ని తయారు చేయాలన్నారు. ఆహారంలో చోటు చేసుకునే కల్తీని గుర్తించాలని,ఆహార రంగులు,అస్నో మోటో టేస్టీ సాల్ట్ ను వాడకూడదన్నారు.
కె.వి.జి.వి.ఎం సంస్థ యొక్క సౌత్ ఇండియా ఆహారభద్రత శిక్షణ ఇంచార్జ్ టి. సింధు, మోహన్ బాబులు మాట్లాడుతూ రాజంపేట, రైల్వేకోడూరు,
నందలూరులోని ఆహార సంబంధ వ్యాపార యజమానులందరూ శిక్షణకు ధ్రువపత్రం కలిగి ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో
కె.వి.జి.వి.ఎం రాయలసీమ గ్రూప్ ఇంచార్జ్ పూజారి రెడ్డి శేఖర్,రాజంపేట ఎగ్జిక్యూటివ్స్ అశోక్, సురేంద్ర,తదితరులు పాల్గొన్నారు.

