ప్రజాస్వామ్య దేశంలోని వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మిక, కర్షకులు,ప్రజాస్వామ్యవాదులు,జర్నలిస్టులహక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ రాజు

Spread the love

కడప జిల్లా ఫిబ్రవరి 12

(నవ్యంధ్ర న్యూస్ )

బలమైన ప్రజాస్వామ్య దేశంలో వివిధరంగాలలో పనిచేస్తున్న కార్మికులు, కర్షకులు,ప్రజాస్వామ్యవాదులు,జర్నలిస్టుల
హక్కులను
కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుచంద్రమోహన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ కడప నగరంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు వాటిఅనుబంధసంస్థలు,ప్రజాసంఘాలు.
జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భాగస్వామిగా నిలిచింది.
కోటిరెడ్డి కూడలి నుంచి ఏడురోడ్ల కూడలి వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో సిఐటియు,
ఏఐటీయూసీ,వివిధ కార్మిక,ప్రజా సంఘాలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రతినిధి చంద్రమోహన్ రాజు మాట్లాడుతూ ఎన్డీఏ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాలను తమ చెప్పు చేతులలో ఉంచుకొని నిరంకుశంగా
వ్యవహరిస్తోందన్నారు. ఎన్నో పోరాటాలు ఆత్మబలిదానాలతో సాధించుకున్న ఎన్నో చట్టాలను రద్దుచేసి కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. నిరంకుశ విధానాలు నియంతృత్వధోరణలతో ప్రజలు కార్మిక,కర్షిక జర్నలిస్టులు,వివిధ వర్గాలఉద్యమకారులను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందన్నారు.
కార్మికులను బానిసలుగా చేసి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను అమలు చేస్తున్నారని దేశంలోని 40 కోట్ల మంది కార్మికుల కుటుంబాలు రోడ్ల
పాలయ్యేలా కేంద్రం కొత్త చట్టాలను
తీసుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే బలమైన పోరాటం ద్వారా ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దుచేసి ఎందరో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోడ్ లు అమలులోకి వస్తే జర్నలిస్టులు,పత్రిక స్వేచ్ఛ ప్రమాదంలో
పడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు గాలి చంద్ర. సిఐటియు నాయకుడు మనోహర్.ఐటియుసి నాయకుడు సుబ్బారెడ్డి, జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు నూర్ భాషా,సిద్దయ్య రాజు, శ్రీనివాసులు రెడ్డి, సూరిబాబు,సతీష్ కుమార్,సత్యమయ్య , దుర్గాప్రసాద్,రవికుమార్,రాజేష్,వివిధ సంఘాల నేతలు ప్రతినిధులు, తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *