నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి
కుంపిణీపురం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా – టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు
చమర్తికి ఘన స్వాగతం పలికిన కుంపిణీపురం గ్రామ ప్రజలు
ఆత్మీయ సమావేశంలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న చమర్తి
అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 07
( నవ్యాంధ్ర న్యూస్ )
కుంపీణీపురం గ్రామ అభివృద్ధికి కృషి చేసి ఎల్లప్పుడూ అండగా ఉంటానని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.
కుంపిణీపురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి సీనియర్ నాయకులు యెద్దుల సుబ్బారాయుడుతో కలిసి పాల్గొనేందుకు విచ్చేసిన చమర్తికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్బంగా గ్రామ ప్రజల సమస్యలు,
ప్రభుత్వ పథకాలు, అందుతున్న తీరును,
గ్రామానికి కావాల్సిన అవసరాలను చమర్తి అడిగి తెలుసుకున్నారు.
గ్రామస్తులు పలు అంశాలపై విజ్ఞప్తులు తెలియజేసారు.
గ్రామ ప్రజల ఆతిథ్యంలో పాల్గొనడం సంతోషదాయకమన్నారు
గ్రామ అభివృద్ధి కోసం,ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,అండగా ఉంటానని భవిష్యత్తులో కుంపిణీపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తాన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గీతాంజలి విద్యాసంస్థల అధినేత రమణ,మండల టిడిపి అధ్యక్షులు జంగం శెట్టి సుబ్బయ్య,క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్,అమ్మినేని విజయ్,టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు పోలి శివకుమార్, పరశురాం నాయుడు, రాము యాదవ్,గ్రామ టిడిపి అధ్యక్షులు గణపతి సుధాకర్ రాయల్,కన్వీనర్ గణపతి భాస్కర్ రాయల్, గ్రామ ప్రధాన కార్యదర్శి సాయి మహేశ్వరి రాయల్, కోనేటి శివ రాయల్, చెరువులపల్లి హరి బాబు, సాయి వెంకట నరసయ్య, చింతకాయల నరసింహులు, నువ్వుల శివయ్య, పల్లిపాటి నరేష్,మహిళలు,
కార్యకర్తలు,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

