పెన్షనర్లు ఉన్నతాధికారులకు ఇచ్చే సలహాలు రాజంపేట అభివృద్ధికి కీలకం

Spread the love

సబ్ కలెక్టర్ బావన

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 17

(నవ్యంధ్ర న్యూస్ )

పెన్షనర్లు రాజంపేట అభివృద్ధిలో పాలు పంచుకునిమీఅపారమైన అనుభవంతో సీనియర్ సిటిజన్స్ గా మీరిచ్చే సూచనలు ఎంతో విలువైనవని సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన అన్నారు.
రాజంపేట పెన్షనర్స్ అసోసియేషన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా పిల్లిపిచ్చయ్య అధ్యక్షతన ఆల్ ఇండియా పెన్షనర్స్ డేను స్థానిక సబ్ కలెక్టర్
సభా భవన్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్ అసోసియేషన్ తాలూకా యూనిట్ సభ్యులు నిర్వహించిన పెన్షనర్స్ డే లో
సబ్ కలెక్టర్ భావన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ భవన మాట్లాడుతూ పెన్షనర్స్ కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తానని.మీ సమస్యలు వినడానికి,
పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. పెన్షనర్స్ తమ అనుభవాలను రాజంపేట అభివృద్ధికి
వినియోగించాలన్నారు.
75 సంవత్సరాలు
పైబడిన పెన్షనర్స్ అందరిని ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ శాలువా, పూలమాల,మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు.
పెన్షనర్స్ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసిన సబ్ కలెక్టర్ ను ఆంధ్ర ప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ తాలూకా యూనిట్ సంఘ అధ్యక్షులు పిల్లి పిచ్చయ్య,కోశాధికారి జీవి.చలపతి,జనరల్ సెక్రెటరీ,పి ఎల్లయ్య ముఖ్య సలహాదారుడు రెవెన్యూ డివిజనల్ అధికారి రిటైర్డ్, యన్ ఈశ్వరయ్య,
గౌరవ సలహాదారు
ఓ రామచంద్రయ్య,
విశ్రాంతి తాసిల్దార్ తదితరులు ఘనంగా సత్కరించారు.
గతంలో వివిధ స్థానాలలో పోరాటాలతో పెన్షన్ ప్రభుత్వాల బిక్షగాలు పెన్షన్ ఉద్యోగుల హక్కు అని సంపాదించుకున్న పెన్షన్ను భవిష్యత్తులో నిలబెట్టుకోవడానికి పెన్షనర్లు అందరూ సంఘటితంగా
అవసరమైతేపోరాటాలకు కూడా సిద్ధం కావాలని రిటైర్డ్ జిల్లా రెవిన్యూ అధికారి ఎన్ ఈశ్వరయ్య కోరారు.
ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు.. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సంగీత ఉపాధ్యాయిని దాసరి శ్రీవాణి ప్రార్థన గీతంతో ప్రారంభమైన పెన్షనర్స్ డే పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎల్లయ్య వందన సమర్పణతో విజయవంతంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *