పెట్టుబడి దారులకు అనుకూలంగా కార్మిక శ్రమను దోపిడి చేసేందుకు పని గంటలు పెంచారు
పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించాలి
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాజంపేట బైపాస్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా
అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 24
( నవ్యాంధ్ర న్యూస్ )
రాష్ట్రంలో కార్మికుల పని గంటలను 8 నుంచి 13కు పెంచుతూ శాసనసభ,
శాసనమండలి చేసిన తీర్మానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి సికిందర్ డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా సికిందర్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా కనీస వేతనాలను ప్రభుత్వం సవరించలేదని, తక్షణమే కనీస వేతనాలను ప్రస్తుత ధరలకనుగుణంగా సవరించాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ సమావేశాల్లో కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే అందుకు విరుద్ధంగా కార్మిక వ్యతిరేక చర్యలకు కూటమి ప్రభుత్వం పూనుకుంటున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల శ్రమను దోపిడి చేసేందుకు పని గంటలు పెంచిందని ఆరోపించారు.కార్మికులకు నష్ట దాయకంగా పనిగంటలను,పని విస్రృతిని పెంచడం, ఓవర్ టైమ్ కాలాన్ని రెట్టింపు చేయడం, మహిళల చేత రాత్రిపూట పని వంటివి పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించడానికే మహిళలకు కల్పించాల్సిన సౌకర్యాలను రక్షణను యాజమాన్యాలు కల్పించడం లేదన్నారు.యాజమాన్యాలు మరింత దోపిడీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు సహాయ కార్యదర్శి రమణ, సురేష్, మౌలా, నరసింహులు ,రవి రాఘవేంద్ర ,రమేష్ ,తులసినాయక్ ,అంజి,
తదితరులు పాల్గొన్నారు

