విజయవాడ డిసెంబర్ 09
(నవ్యంధ్ర న్యూస్ )
పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజను మంగళవారం
20 సూత్రాల అమలు కమిటీ అధ్యక్షులు
లంకా దినకర్ తో కలిసి శ్రీశైలం ధర్మకర్తల మండలి పోతుగుంట రమేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి రాజంపేట మండలపరిధిలోని ఎకిరిపల్లి ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డుకు నోచుకోలేదని ఎకిరిపల్లి గ్రామానికి రోడ్డు రోడ్డు నిర్మాణం చేపట్టి రోడ్డు వసతి కల్పించాలని వినతి పత్రంఅందజేశారు. పంచాయతీ రాజ్ గ్రామీణ కమిషనర్ సానుకూలంగా స్పందించి ఎకిరిపల్లి గ్రామానికి త్వరతగతిన రోడ్డు నిర్మాణం చేపట్టి రోడ్డు వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే అధికారులను పిలిపించి రోడ్డు నిర్మించడానికి ఉన్న అడ్డంకులను గుర్తించి వెంటనే సమస్యలను పరిష్కరించి రోడ్డు నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణ తేజకు పోతుగుంట రమేష్ నాయుడు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

