నియోజకవర్గానికి పట్టిన గ్రహలు వైసీపీ నాయకులే

Spread the love

నియోజకవర్గ అభివృద్ధి పై బహిరంగ చర్చకు అకేపాటి సిద్ధమా సవాల్ విసిరిన చమర్తి

తక్షణమే వైకాపా ఎంపీ,ఎమ్మెల్యేలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన టీడీపీ శ్రేణులు

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 13

(నవ్యంధ్ర న్యూస్ )

వైకాపా నాయకులే రాజంపేట నియోజకవర్గానికి పట్టిన గ్రహాలని చమర్తి జగన్ మోహన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా నాయకుల అహంకారం,
పెత్తందారితనం,
స్వార్థ వైఖరి కారణంగానే నియోజకవర్గం అభివృద్ధిలో
వెనకబడిందన్నారు.
పట్టణంలోని తెలుగుదేశం
కార్యాలయంలోశనివారం తెలుగుదేశం శ్రేణులు, నాయకులు,కార్యకర్తలతో కలసిమీడియాసమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలురేకెత్తించవద్దని,అన్ని అర్హతలు ఉన్న రాజంపేట కు ద్రోహం చేసింది వైకాపా కాదా అని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ప్రశ్నించారు.
జిల్లా కేంద్రం అంశంలో గత వైకాపా ప్రభుత్వం అన్యాయంచేసిందనందులకు,ప్రజలకు క్షమాపణ చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన గళం విప్పాలన్నారు.
మోసం చేసిన వైసిపి పార్టీలోకొనసాగుతూ,
అదే కండువాతో మళ్ళీ జిల్లా కేంద్రం కోసం మద్దతు ఇవ్వడం చూస్తుంటే మరి
ఈ తెగువ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రదర్శించింటే,రాజంపేటే
జిల్లా కేంద్రమై అభివృద్ధి చెందేదాన్నారు మదనపల్లి ప్రాంత వాసులకు కేంద్రం రాయచోటి కేంద్రామని జిల్లా కేంద్రంగా రాయచోటిని చేశామని శుక్రవారం రిలేదీక్షలో చెప్పుకొస్తూన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా శాసన సభ్యులుఅసెంబ్లీ,
పార్లమెంట్,రాజ్యసభ సభ్యులు,పార్లమెంట్ లో వాదనలు వినిపించి జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించేలా చూడాలని ఆలా ప్రకటించుకోలేక పోతే రాజీనామాలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు సుబ్బనరసయ్య నాయుడు,రాష్ట్ర కార్యదర్శి ఇడిమడకల కుమార్,టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మందా శ్రీనివాసులు,మండల ప్రధాన కార్యదర్శి జీ.వీ సుబ్బారాజు, ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఎస్కే కరీమ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూర్యనారాయణ రాజు, సొసైటీ డైరెక్టర్ పరశురాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *