నకిలీపత్రాలు సమర్పించిన 17మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ నుండి తొలగింపు

Spread the love

గుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) న్యాయవిద్యకు సంబంధించి నకిలీ ధృవపత్రాలతో 17మందిపై వేటు

నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా కొనసాగుతున్న 17 మందిని రాష్ట్ర బార్ కౌన్సిల్ నుండి తక్షణమే తొలగిస్తూ కౌన్సిల్ కార్యదర్శి బి.పద్మలత సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

న్యాయవాదులుగా నమోదు అయ్యే సమయంలో రాష్ట్ర బార్ కౌన్సిల్కు వీరంతా అర్హత లేకుండా తప్పుడు మార్గంలో విద్యకు సంబంధించిన దృవపత్రాలు సమర్పించారు.

రాష్ట్ర ఎన్రోల్మెంట్ కమిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఈ అంశాన్ని తెలియజేయగా, ఏపి బార్ కౌన్సిల్ రోల్స్ నుండి వారి పేర్లు తొలగించాల్సిందిగా ఆదేశాలు అందాయి.

ఈ నకిలీ న్యాయ వాదులంతా రాష్ట్ర హైకోర్టుతోపాటు వివిధ ప్రాంతాల్లో న్యాయవాద వృత్తి కొనసాగించారు.

ఈ 17మందిని తక్షణమే తొలగిస్తున్నట్లు నోటిఫికేషన్ వెలువరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *