దేవరకొండ భానుమూర్తి స్వామి 33 వ తిరుమల మహా పాదయాత్రకు ఘనస్వాగతం పలికిన భక్తులు

Spread the love

పాదయాత్ర భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసిన మాజీ శాసనసభ్యులు
మేడా మల్లికార్జున రెడ్డి

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 13

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేటలో దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి ఆధ్వర్యంలోనిర్వహించిన 33 వ తిరుమల మహా పాదయాత్రలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా
బానుమూర్తిశర్మ స్వామి మాట్లాడుతూ మండలపరిధిలోని చెర్లోపల్లి గ్రామం నుండి తెల్లవారుజామున ప్రారంభమైనపాదయాత్రకు పట్టణంలోకి చేరుకోగానే దేవరకొండ బానుమూర్తి శర్మ స్వామికి నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుమల మహాయాత్ర
ప్రతి ఏటా అన్నమయ్య కాలిబాటలో
కొనసాగించామని
ఈ పాదయాత్రకు
అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వుక పోవడంతో అలిపిరి మార్గంలో
వెళ్ళతామన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం
శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండి, ప్రజలుసుఖసంతోషాలతో ఉండాలని ఈ తిరుమల మహా పాదయాత్ర ప్రతి సంవత్సరం అశేష భక్త జనులతో అ కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నామన్నారు.పాదయాత్ర చేపట్టిన భక్తులకు అల్పాహారం ఎర్పాటు చేసిన మాజీ శాసనసభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి కుటుంబసభ్యులకు
అ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకర్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *