లక్ష్మీగారిపల్లె వద్ద అన్నసంతర్పణ ఏర్పాటు చేసిన బత్యాల కుటుంబ సభ్యులు
అన్నమయ్య జిల్లా డిసెంబర్ 14
( నవ్యంధ్ర న్యూస్ )
దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి ” 33వ తిరుమల మహా పాదయాత్ర ఆదివారం రైల్వేకోడూరు మండల
పరిధిలోని లక్ష్మీగారిపల్లి గ్రామం వద్దకు చేరుకుంది లక్ష్మిగారిపల్లికి చేరుకున్న దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి తిరుమల మహా పాదయాత్రకు మాజీ ఎమ్మెల్సీ,
తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఆదేశాల మేరకు బత్యాల కుటుంబ సభ్యులు మాజీ జెడ్పిటిసి,న్యాయవాది బత్యాల నాగరాజ ప్రసాద్,బత్యాల
రెడ్డి ప్రసన్న కుమార్ స్వామి వారికి పండ్లు అందజేసి ఘన స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొని బత్యాల స్వగ్రామమైన
లక్ష్మీగారిపల్లెలో భానుమూర్తి శర్మ స్వామి పాదయాత్రలో వచ్చే భక్తులకు అన్నసంతర్పణ ఎర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భక్తులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

