అమరావతి డిసెంబర్ 11
(నవ్యంధ్ర న్యూస్ )
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన అధికార ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లను తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం,ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు,ప్రజల సమస్యలు,జిల్లాల స్థాయి అభివృద్ధి వంటి అంశాల పై నాయకులు పరస్పరం చర్చించారు. పార్టీ కార్యకలాపాలు,
ప్రజా సేవ పట్ల శ్రద్ధతో ముందుకు సాగాలని సూచించారు.

