అన్నమయ్య జిల్లా డిసెంబర్ 10
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండల పరిధిలోని హెచ్ చెర్లోపల్లి గ్రామంలో వెలసియున్న
శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నుంచి దేవరకొండ భానుమూర్తి శర్మ ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీ శనివారం 33వ తిరుమల మహా పాదయాత్ర ప్రారంభమౌతుందని దేవరకొండ భానుమూర్తి శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా తిరుమల పాదయాత్రలో పాల్గొనే భక్తులకు అల్పాహారం, భోజన వసతి కల్పించ బడునని తెలిపారు. రాముడే దేవుడు దేవుడే రాముడనే నినాదంతో 32సంవత్సరాలుగా తక్కువ మందితో ప్రారంభమైన
ఈ తిరుమల మహా పాదయాత్ర ప్రస్తుతం అనేక మంది భక్తులతో తిరుమల మహా పాదయాత్రగా వెళ్లి
శ్రీ కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించు
కుంటున్నామన్నారు.
ప్రతి సంవత్సరం పాదయాత్ర చేపట్టే ముందు రోజు హెచ్ చెర్లోపల్లి గ్రామంలో వెలసియున్న
శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో శుక్రవారం 1008 ముత్తైదువులచే
శ్రీ సీతమహాలక్ష్మి కుంకుమర్చన నిర్వహించి పాదయాత్రకు ప్రారంభిస్తామన్నారు. ప్రతి సంవత్సరంలనే ఈ సంవత్సరం 12వ తేదీ శుక్రవారం హెచ్ చెర్లోపల్లి శ్రీ కోదండరామ దేవస్థానంలో
శ్రీ సీతమహాలక్ష్మి కుంకుమర్చన 1008 మంది ముత్తైదువులచే నిర్వహిస్తున్నామని ఈ కుంకుమర్చనలో పరిసర ప్రాంత భక్తులు పాల్గొని
ఆ సీతరాముల దివ్య ఆశీస్సులు పొందాలనికోరుచున్నారు.

